నీడనిచ్చిన కారులోనే సజీవదహనం.. వికారాబాద్‌లో ఘోరం.. - MicTv.in - Telugu News
mictv telugu

నీడనిచ్చిన కారులోనే సజీవదహనం.. వికారాబాద్‌లో ఘోరం..

January 20, 2020

bgh

ఇల్లు లేక కారులో జీవిస్తున్న ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో మృతిచెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు ప్రాంతానికి చెందిన వీరన్న(70)కు ఇల్లు లేదు. పట్టణంలోని మర్రిచెట్టు కూడలిలో ఉన్న దుకాణాల్లో చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. రోజూ మర్రిచెట్టు దగ్గరలో ఉన్న ఓ పాత కారులో నిద్రిస్తూ ఉండేవాడు.  

ఆదివారం కట్టమైసమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. అందుకోసం రాత్రి కారు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో వంటలు చేశారు. వంటలు పూర్తయిన తర్వాత మంటలు ఆర్పకుండా వెళ్లిపోయారు. దీంతో టెంటుకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు ప్రమాదవశాత్తు వీరన్న నిద్రిస్తున్న కారుకు వ్యాపించాయి. అప్పటికే మంటలు పూర్తిగా చెలరేగడంతో కారులో నిద్రిస్తున్న వీరన్న మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.