vegetables ration in great britan
mictv telugu

కూరగాయలకు రేషన్- బ్రిటన్ లో దారుణంగా పరిస్థితులు

February 24, 2023

vegetables ration in great britan

బాగా డబ్బులున్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. కష్టపడి సంపాదించుకుందో, కొల్లగొట్టి సంపాదించుకుందో….ఏది అయితేనేమి మొత్తానికి ఆర్ఇకంగా బల్గా ఉండే దేశం. అయితే ఇప్పడు అక్కడ పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఓడలు, బళ్ళు…బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యంలో కొట్టుకుపోతోంది. ఎంతో కొంత ప్రతీ దేశం ఆర్ధిక మాంద్యం దెబ్బకు బలయినవే. దానికి తోడు రష్యా-ఉక్రెయిన్ వార్. ఇప్పడు బ్రిటన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఆ దేశాన్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇప్పుడా దేశంలో కూరగాయల కొరతకు దారి తీసింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. దేశ ప్రజలు వినియోగించే పలు కూరగాయల్ని బ్రిటన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్ కు అవసరమైన కూరగాయలను,పండ్లను ఎగుమతి చేసే ఆఫ్రికా,యూరప్ లోని పలు దేశాల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు,ఇంధన ధరలు పెరగటంతో కూరగాయల దిగుబడి మీదారవాణా మీద ప్రభావం పడ్డాయి.ఉక్రెయిన్ – రష్యాల మధ్య సాగుతున్న యుద్ధం…రవాణా మీద ప్రభావం పడింది. దీంతో.. బ్రిటన్ వ్యాప్తంగా ప్రముఖ సూపర్ మార్కెట్లు, సంస్థలు.. పలు కూరగాయలు,పండ్ల మీద పరిమితుల్ని విధించాయి. దాదాపు నెల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు.

టమోటాలు, క్యాప్సికం, దోసకాయలు,బ్రకోలి,క్యాలిఫ్లవర్ లాంటి కూరగాయల సరఫరా తక్కువగా ఉండటంతో వాటిపై రేషన్ విధించారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క వినియోగదారుడికి మూడు మాత్రమే అమ్ముతామని షరతు పెట్టారు. దీంతో.. ప్రముఖ సూపర్ మార్కెట్లలో కూరగాయల్ని ఒక్కో వ్యక్తికి మూడేసి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఒక వ్యక్తికి మూడు టమోటాలు, మూడు దోసకాలు, మూడు క్యాప్సికం మాత్రమే ఇస్తారన్నమాట. ఎవరెంత మొత్తుకున్నా, ఇబ్బందులు పడ్డా మేము ఏమీ చేయలేం అని చేతులెత్తేస్తోంది అక్కడి ప్రభుత్వం.