ఎర్రగడ్డలో కూరగాయల లూటీ.. కరోనా..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రగడ్డలో కూరగాయల లూటీ.. కరోనా.. 

March 23, 2020

Vegetebles looted in Hyderabad erragadda market 

కరోనా ప్రాణాలు తీయడమే కాకుండా నానా నేరాలకూ దారులు వేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రులు చేస్తున్న హెచ్చరికలు నాలుక గీసుకోడానికి కూడా పనికిరాకుండా పోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కిలో టమాటలు రూ. 100 పలుకుతున్నాయి. కొందరికి అవి కూడా దొరకడం లేదు. 

ఈ నెల 31వరకు లాక్‌డౌన్ ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో రైతుబజార్లు ప్రజలతో కిక్కిరిశఆయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు సందట్లో సడేమియా అని ధరలను భారీగా పెంచేశారు. బీర, బెండ, వంకాయ, కాకరకాయలు.. ఏది ముట్టుకున్నా వంద అనేశారు. దీంతో ప్రజలకు ఆగ్రహంతో వాగ్వాదానికి దిగారు. మాటలు కాస్తా చేతల దాకా వెళ్లాయి. ఇదే అదనుగా భావించి కొందరు కూరగాయలనున లూటీ చేశారు. వ్యాపారుల గుంజుకుంటున్నా బలవంతంగా లాక్కుని సంచుల్లో దోపుకుని తుర్రుమన్నారు. ధరలను నియంత్రించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్న అధికారుల ప్రకటనలు ఇలా అపహాస్యం పాలవుతున్నాయి.