0001 నంబర్ కోసం కొట్టుకున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

0001 నంబర్ కోసం కొట్టుకున్నారు

April 16, 2019

ఖరీదైన వాహనం కొనుగోలు చేయడం మాత్రమే కాదు.. దానికి తగ్గట్టుగా ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉండేలా చూసుకుంటారు వాహనదారులు. ఫ్యాన్సీ నుంబర్ల కోసం ఎంతైనా ఖర్చుచేయడానికి వెనకాడరు. తాజాగా ఖైరతాబాద్‌లోని సెంట్రల్ జోన్‌లో రవాణా శాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేళంలో రికార్డు స్థాయిలో రూ.3055748 లక్షల రాబడి వచ్చిందట. ఒక్క 9999 నెంబర్ రూపంలోనే పది లక్షలు రావడం గమనార్హం. ప్రస్తుతం ముగుస్తున్న టీఎస్‌ 09 ఎఫ్‌ఈ సిరీస్‌లో 9999 నంబరును ఎన్‌ఎస్‌ఎల్‌ ప్రాపర్టీస్‌ సంస్థ రూ.10లక్షలకు కైవసం చేసుకుంది.

Vehicle owners fight for 0001 fancy number at khairatabad registration office.

కొత్త సీరీస్‌ అయిన ‘టీఎస్‌09 ఎఫ్‌ఎఫ్‌’లో 1 నంబరును ఎఫ్‌ఆర్‌ఆర్‌ హిల్‌ హోటల్స్‌ రూ.6.95లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే 99 నంబరును ఎమర్జిన్‌ అగ్రినోవో సంస్థ రూ.2.78లక్షలు చెల్లించి దక్కించుకుంది. ఇక్కడ 9 సంఖ్యకు బాగా డిమాండ్‌ ఉన్నా ఈసారి అధికారులు నిర్ణయించిన రూ.50వేలకే అమ్ముడు పోవడం గమనార్హం. కాగా, కొత్త సీరీస్‌లో 0001 నెంబర్ కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేశాడు. సాధారణంగా కావాల్సిన నెంబర్‌ను కైవసం చేసుకోవాలంటే.. ఆ నెంబర్ కోసం అధికారులు నిర్ణయించిన మొత్తంతో పాటు వారు ఆ నెంబర్ కోసం పెట్టదలచుకున్న మొత్తాన్ని చెక్కుపై రాసి కవర్‌లో పెట్టి నిర్ణిత సమయంలో టెండర్ డబ్బాలో వేయాలి. 0001 నెంబర్ కోసం నలుగురు వ్యక్తులు కవర్లను డబ్బాలో వేశారు. అధికారులు డబ్బాలను తెరుస్తున్న సమయంలో మరో వ్యక్తి అదే నెంబర్ కోసం డబ్బాలో కవర్ వేయడానికి ప్రయత్నించగా అదే నెంబర్ కోసం డబ్బాలో కవర్ వేసిన మరో వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. దీనితో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు.