కేబుల్ బ్రిడ్జి  రాకపోకలపై మూడు రోజులు నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

కేబుల్ బ్రిడ్జి  రాకపోకలపై మూడు రోజులు నిషేధం

October 2, 2020

Vehicles No Entry in Hyderabad Cable Bridge

హైదరాబాద్‌లో దుర్గం చెరువు వద్ద నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఎవరూ ఆ మార్గంలో రాకూడదని సూచించారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై సమీక్ష జరిపారు.   

ఈ మార్గం ఇటీవలే తెరుచుకోవడంతో విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీంతో దుర్గం చెరువు వద్ద పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది. ఎక్కువ మంది వస్తూ ఫొటోలు దిగుతూ.. ఆ ప్రాంతం అంతా కలియ తిరుగుతున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాల కారణంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. దీనికి తోడు పార్కింగ్ సమస్య కూడా ఉండటంతో ఈ నేపథ్యంలోనే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల పాటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, నగరంలో హైటెక్ సిటీ వైపు వెళ్లే వారి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.