ఎక్కడికక్కడ బంద్..తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిన వాహనాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఎక్కడికక్కడ బంద్..తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిన వాహనాలు

March 23, 2020

Borders

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో పూర్తిగా జన జీవనం స్తంభించి పోయింది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో ఎవరూ బయటకు రావడం లేదు. మరోవైపు అంతరాష్ట్రాల సరిహద్దులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మూసివేయడంతో సరిహద్దుల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్లు, కంటైనర్లను సరిహద్దుల్లోనే పోలీసులు ఆపేస్తున్నారు. 

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే నిలిపేస్తున్నారు. చాలా మంది కార్లు వేసుకొని రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని కూడా అనుమతించడం లేదు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో నిలిపివేసిన లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. ఎవరకీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.