టీడీపీకి మరో షాక్.. వేం కూడా గుడ్‌బై - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి మరో షాక్.. వేం కూడా గుడ్‌బై

October 28, 2017

తెలంగాణలో టీడీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి గుడ్‌బై చెప్పిన కాసేపటికే వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేత వేం నరేందర్ కూడా రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి పచ్చ పార్టీ నుంచి వెళ్లిపతే నరేందర్ రెడ్డి కూడా తప్పుకుంటారని ఇదివరకే వార్తలు వచ్చాయి.

నరేందర్ తోపాటు భూపాలపల్లి జిల్లాకు చెందిన ముఖ్య నేత గండ్ర సత్యనారాయణరావు, నల్గొండ జిల్లా నుంచి పోలిట్‌ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి, సీతక్కతో పాటు ప‌లువురు కూడా జంప్ అవుతారని వార్తలు వచ్చాయి. నరేందర్ ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేయడం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో రేవంత్‌తోపాటు నరేందర్, నరేందర్ కొడుకు కృష్ణ కీర్తన్‌లను కూడా అధికారులు విచారించారు.