Home > Featured > రాజన్న చెంతకు కాళేశ్వరం..400 కోట్లతో గుడి అభివృద్ధి

రాజన్న చెంతకు కాళేశ్వరం..400 కోట్లతో గుడి అభివృద్ధి

Vemulavada temple.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని భారీస్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. ఈయన ఈ రోజు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలిసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్ మానేరు జలాలను వేములవాడ గుడి చెరువులోకి విడుదల చేశారు. తర్వాత చెరువు వద్ద గంగమ్మతల్లికి హారతి ఇచ్చారు. వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని, సుందరీకరణ పనులు కూడా ఇందులో భాగమని మంత్రి చెప్పారు. 400 కోట్ల రూపాయలతో గుడిని అభివృద్ధి చేస్తామని, మినీ ట్యాంక్ బండ్‌ను నిర్మిస్తామని తెలిపారు.

Updated : 5 Sep 2019 4:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top