వేములవాడ ఆసుపత్రిలో నేరేళ్ల బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

వేములవాడ ఆసుపత్రిలో నేరేళ్ల బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

August 8, 2017

నేరేళ్ల బాధితులను పరామర్శించారు మంత్రి కేటీఆర్. జరిగిన సంఘటన బాధాకరమని, ఇలా జరగాలని ఎవరూ కోరుకోరని తన బాధను వ్యక్తం చేసారు. ప్రజలు దయతలిచి ఆశీర్వదిస్తేనే మేము అధికారంలోకి వచ్చాము. ఇలాంటి సంఘటనలు బాధాకరం. మేము ఇలాంటివి అస్సలు ప్రోత్సహించము. అలాంటి పద్దతి నాడు లేదు – నేడూ లేదు. క్షణికావేశంలో లారీలు కాల్చడం, కేసులు పెట్టడం జరిగింది. ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే భరిస్తాం కానీ ఇసుక మాఫియా అని అంటే సహించమని చెప్పారు.

గత 50 ఏళ్లలో ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, ఈ మూడేళ్లలో వచ్చిన ఆదాయం గమనిస్తే ఇక ఇసుక మాఫియా ఎలా అవుతుందని ప్రశ్నించారు. మిడ్ మానేరును శరవేగంగా ఖాళీ చేయించడానికి ఇసుక తీస్తున్నాం. ఈ కేసుల్లో దళితులు, బీసీలు ఉన్నారు. అలాగే పోలీసులను మమ్మల్ని ఎందుకు హింసించారని బాధితులు ప్రశ్నించారు. Dig నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ విమర్శలు సరికాదు, వారి తిట్లు దీవెనలు గానే భావిస్తామని,
నా నియోజకవర్గం ప్రజలకు మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించి విఫలం అవడం తప్ప వాళ్ళు సాధించేదేమీ వుండదు. అలా చేస్తే వారంతా టూరిస్టులుగానే వుంటారు.

అలాగే నేరేళ్ళ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఇసుక ద్వారా 50 ఏళ్ళ ఆదాయం మూడేళ్లలో తెచ్చాము. అసంబద్ద వాదనలు మాని, ప్రజల మేలు కోసం పనిచేయండి. తెరాస ప్రభుత్వం ఇలాంటి వాటిని అస్సలు ఒప్పుకోదు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. మీడియా కూడా జరగని తప్పును తప్పుగా చూపించవద్దు. సంయమనం పాటించండి. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక సాయం చేసి మళ్ళీ మాకు ఓటు వేయమనే కుసంస్కారం మాది కాదు అని కేటీఆర్ అభిప్రాయ పడ్డారు.