జైలర్ల పైశాచికం.. నగ్నదేహాలపై కోళ్లపందేలు.. - MicTv.in - Telugu News
mictv telugu

జైలర్ల పైశాచికం.. నగ్నదేహాలపై కోళ్లపందేలు..

October 10, 2019

జైలులో ఖైదీలను కఠినంగా శిక్షించడం సాధారణమే విషయమే.వెనిజులా దేశంలోని అనాకోలోని పోలీస్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌లోని జైలు గార్డులు ఖైదీలను హింసించడానికి కొత్త పద్దతిని ఎంచుకున్నారు. సరిపడా నీరు, ఆహరం ఇవ్వాలని, బంధువులు చూడటానికి వచ్చినపుడు మెడిసిన్స్‌ తేవటానికి అనుమతి ఇవ్వాలని  ఖైదీలు నిరసనకు దిగడంతో వారినిదారుణంగా శిక్షించారు. 

jail

70మంది ఖైదీలను 2 గంటల పాటు విచక్షణా రహితంగా కొట్టారు. తరువాత వారిని నగ్నంగా చేసి, నేలపై పడుకోబెట్టి శరీరాలపై ఆకలితో ఉన్న కోళ్లను వదిలారు. కోళ్లు ఖైదీల శరీరాలను చీరుతుంటే చూసి ఆనందించారు. ఆ తర్వాత కొన్ని గంటలు వారికి తిండి, నీరు కూడా ఇవ్వలేదు. దీంతో పలువురు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 2న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వెనిజులాకు చెందిన ఓ రిపోర్టర్‌ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో కైవెనిజులా ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణకు ఆదేశించింది.