ఉప రాష్ట్రపతి పదవికి బి.జె.పి. అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్య నాయుడుకి జనసేన శ్రేణుల తరపున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్. సీనియర్ రాజకీయ నాయకునిగా అపార అనుభవమున్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్ర పదవికి వన్నె తెస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన పరిణామంగా,తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాట్టు అన్నారు. వెంకయ్య నాయుడు అభ్యర్థిగా ఎంపిక చేసిన బి.జె.పి. అధినాయకత్వానికి అబినందనలు తెలిపారు.