వెంకయ్యరూటే సెపరేట్... - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్యరూటే సెపరేట్…

July 17, 2017

తెల్లటి అంగీ. తెల్లటి పంచె.  ఎప్పుడు చూసినా ఇదే. లుంగీలా ఉండే  పంచె కట్టు వెంకయ్యనాయుడు స్పెషల్. నెల్లూరు జిల్లాల్లో ఉన్నా…… పార్లమెంట్ సెంట్రల్ హాల్లో స్పీచ్ ఇచ్చినా ఇదే డ్రెస్. బహుషా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు చెప్పలేం. బట్టల  విషయంలో ఈయన ఎంత స్పెషలో మాటల్లో అయితే మరింత స్పెషల్.

ఒకే మాటను ఎన్ని తీర్లు చెప్పినా… ఎన్ని చెణుకులు విసిరినా.. మెరుపులు  మెరిపించినా…. మెప్పించినా వెంకయ్య నాయుడుకే చెల్లుతుంది. విషయం ఏదైనా సరే వెంకయ్యనాయుడు మాట్లాడారంటే  అందులో పంచులు పడాల్సిందే. పంచ్ లేకుండా వెంకయ్యనాయుడు స్పీచ్ ఉండనే ఉండదు.  ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషల్లో ఆయన బాగా మాట్లాడ్తారు.  అప్పట్లో ఎపి అసెంబ్లీలో ఆయన స్పీచ్ లు అదిరిపోయేవని అప్పటి నాయుకులు గుర్తు చేస్తారు. తన  స్పీచ్ లపై పుస్తకం కూడా వచ్చింది.

అప్పట్ల చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సిఎంగా ఉన్నప్పుడు వెంకయ్య స్పీచ్ లు, బాబుపై వేసిన సెటైర్లు పేలి పోయేవి. ‘‘చంద్రబాబు  హైటెక్…ఆయన పాలన లోటెక్’’. ఇట్లా సాగేది ఆయన ఉపన్యాస ధోరణి. అంతే  కాదు కాంగ్రెస్ నాయకులపై మాట్లాడినా అదే తీరు. కొన్ని  స్టేట్ మెంట్లు వెంకయ్యనాయుడే ఇస్తే ఆ స్పందనే వేరుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారనే విషయం గురించి మీడియా వాళ్లు అడిగినప్పుడు.. ఇంతకంటే దౌర్భాగ్యం  ఏం లేదని అన్నారు. ఆ తర్వాత దాని గురించి ఆయన మాట్లాడ లేదు. అయితే ఏదైనా విషయం చెప్పాలంటే… ఒకే మాటను ఎన్ని తీర్ల అయినా చెప్పగల సత్తా ఉన్న నాయకుడు వెంకయ్యనాయుడు.

కమ్యూనిస్టులపైనా, కాంగ్రెస్ నాయకులపైనా వెంకయ్య ఎన్ని సెటైర్లు వేశారో… ఎన్ని తీర్ల వాళ్లను విమర్శలు చేశారో. మాట చిన్నగానే ఉంటుంది….. చెవిలో పడగానే గొల్లమని నవ్వతారు ఎవ్వరైనా సరే. ‘‘ నీ రొట్టి  నువ్వు తినడం ప్రకృతి, పక్కోళ్ల రొట్టెను గుంజుకోవడం వికృతి…. నీ రొట్టెను  పక్కోళ్లుకు ఇవ్వడం సంస్కృతి.’’’ ఇదే ఇండియన్ కల్చర్ అని చెప్పారు. ఇట్లా వెంకయ్య మాట్లాడే మాటల తీరే వేరు.

గలగల వెంటకయ్య మాట్లాడుతుంటే… పలపల చప్పట్ల మోత మోగాల్సిందే. ప్రెస్ మీట్లల్లో కూడా వెంకయ్య  సమాధానాలుకు రిపోర్టర్లు కూడా  పడిపడినవ్వుతారు. లేక పోతే భలే చెప్పారండి అని మెచ్చుకోకుండా ఉండ లేరు. అది వెంకయ్య అంటే.