వెంకయ్య రాక సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్య రాక సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

August 21, 2017

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం, మంగళవారం ఇవి అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.30 గంటల వరకు బేగంపేట ఎయిర్‌ పోర్టు, పీఎన్‌టీ జంక్షన్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌,  హెచ్‌పీఎస్‌, బేగంపేట ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్‌ జంక్షన్‌, మోనప్ప ఐ లాండ్‌, ఎంఎంటీఎస్‌, రాజ్‌భవన్‌ రైల్వే గేట్‌, వీవీ విగ్రహం మార్గాల్లో వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తారు. మంగళవారం ఉదయం 7.15 నుంచి 8 గంటల వరకు రాజ్‌భవన్‌, యశోద ఆస్పత్రి, మోనప్ప ఐ లాండ్‌,  ఎంఎంటీఎస్‌, గ్రీన్‌ల్యాండ్‌ జంక్షన్‌, బేగంపేట ఎయిర్‌పోర్టు దారుల్లో వెళ్లే వాహనాలను మళ్లిస్తారు.

వెంకయ్యనాయుడిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరిస్తోంది. అందుకోసం ఆయన నగరానికి వస్తున్నారు.