ఎన్టీఆర్‌కి వెన్నుపోటుపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్‌కి వెన్నుపోటుపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

November 4, 2022

బీజేపీ అగ్రనేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతంపై శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళ్లకు మొక్కి వెన్నుపోటు పొడిచారని ఆనాడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. విషయంలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పెనమలూరులో మన గ్రామం సహజ ఉత్పత్తులు కేంద్రాన్ని వెంయక్యనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆయన కాళ్లకు మొక్కడంతో ఎన్టీఆర్ ఎపిసోడ్‌ను గుర్తు చేసుకున్నారు.

‘ఓ సారి ఎన్టీఆర్ ఇంట్లో కూర్చున్న సందర్భంలో ఆరుగురు మహిళలు ఆయనకు నమస్కరిస్తుంటే.. వారు ఎందుకు నమస్కరించారని ఎన్టీఆర్‌ని అడిగా. నాపై వారికున్న ప్రేమ, అభిమానం అని ఎన్టీఆర్ బదులిచ్చారు. అయితే అభిమానమా.. పిండాకూడా అంతా ఒట్టిదేనని చెప్పానన్నారు. చివరికి చూస్తే వెన్నుపోటు ఉదంతంలో ఆ ఆరుగురు మహిళలే ముందున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆ ఆరుగురు మహిళలు ఎవరనేది మాత్రం వెంకయ్య నాయుడు వెల్లడించలేదు.