వెంకయ్య రాజీనామా చేస్తే హోదా వచ్చేస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్య రాజీనామా చేస్తే హోదా వచ్చేస్తుంది

March 8, 2018

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ కేంద్ర కేబినెట్‌లోని తన మంత్రులతో రాజీనామా చేయించడంతో మరిన్ని రాజీనామా ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన పదవికి వెంటనే రాజీనామా చేస్తే కేంద్రం చచ్చినట్లు ప్రత్యేక హోదా ప్రకటిస్తుందని నటుడు శివాజీ సూచించారు. ఇది తమాషా, ఆషామాషీ ప్రతిపాదన కాదని, దేశాన్ని నివ్వెరపరచి, కేంద్రంతో హోదాను కక్కించేదని ఓ టీవీ చానల్ చర్చలో స్పష్టం చేశారు.

మరోపక్క.. టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి కూడా వెంటనే వైదలగాలని, అప్పుడు మోదీ సర్కారు వెనక్కి తగ్గి హోదాను ప్రకటించే అవకాశముందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ.. ‘హోదా’ కారణంతో ఒక రాష్ట్రంలో తన ఉనికికి తానే దెబ్బకొట్టుకోదని, హోదా కాకున్నా మరో ప్యాకేజీని ప్రకటించే అవకాశముందంటున్నారు.