'నారప్ప'గా వెంకటేష్..అదరగొడుతున్న ఫస్ట్‌లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

‘నారప్ప’గా వెంకటేష్..అదరగొడుతున్న ఫస్ట్‌లుక్

January 22, 2020

yhnjmym

గతేడాది..’ఎఫ్2′, ‘వెంకిమామ’ సినిమాలతో విజయాలు అదనుకున్న విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది నారప్ప సినిమాతో వస్తున్నాడు. తమిళంలో ధనుశ్ నటించిన ‘అసురన్’ సినిమాకు రీమేక్‌ ఇది. తెలుగులో దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్ పెట్టారు. రాయలసీమలోని అనంతపురం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ లుక్‌ను విడుదల చేసారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ధనుశ్ డబుల్ రోల్‌లో నటించగా..తెలుగులో మాత్రం వెంకటేష్‌తో పాటు రానా కూడా నటించే అవకాశం ఉంది