బిస్కెట్ల బిజినెస్‌లోకి వెంకటేశ్ కూతురు.. - MicTv.in - Telugu News
mictv telugu

బిస్కెట్ల బిజినెస్‌లోకి వెంకటేశ్ కూతురు..

October 31, 2017

సినిమా యాక్టర్ల పిల్లలు కూడా సినిమాల్లోకి రావడం కొత్త కాదు. వయసుపైబడిన హీరోలు కోట్లు ఖర్చు పెట్టి తమ పిల్లలను బరిలోకి దింపుతున్నాయి.

ఒకప్పుడు మగపిల్లలనే దించేవాళ్లు. కానీ ఇప్పుడు కొందరు ఆడపిల్లలను కూడా వెండితెరపైకి తీసుకొస్తున్నాయి. అయితే తెలుగు హీరో వెంకటేశ్ కూతురు ఆశ్రిత మాత్రం వేరే మార్గంలో వెళ్తోంది. పక్కా సినిమా ఫ్యామీలో పుట్టినా ఆమెకెందుకో సినీఫీల్డుపై ఆసక్తి లేదు. తన అభిరుచికి తగ్గట్లు బిస్కెట్ల వ్యాపారంలోకి ప్రవేశించింది. టాలీవుడ్ వర్గాల కథనాల ప్రకారం.. ఆశ్రిత బిస్కట్ల వ్యాపారానికి సంబంధించిన అంతర్జాతీయ కోర్సు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలుండే కుకీస్, బిస్కెట్స్, కుకీస్ తయారీ గురించి తెలుసుకుంది.  వీటిని తయారు చేసిన షాపుల్లో అమ్మడానికి యత్నిస్తోంది. రామానాయుడు స్టూడియోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిచయం చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.