Venuswami gave the horoscope of Pawan and Chandrababu
mictv telugu

పవన్, బాబుల కలయిక జ్యోతిష్యం ఒప్పుకోదు.. అంధకారమే

October 21, 2022

Venuswami gave the horoscope of Pawan and Chandrababu

మొన్నటి వరకు విడివిడిగా ఉన్న జనసేన – టీడీపీలు విజయవాడలో అనూహ్యంగా కలిసిపోవడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యాయి. ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం ఖాయమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు వైసీపీ మాత్రం సింహం సింగిల్‌గానే వస్తుందని, ఈ సారి 175 నియోజకవర్గాలు గెలుస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఏం జరగబోతుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల కలయికపై ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిస్తే అంధకారమే కానీ అధికారం రాదని బాంబు పేల్చారు.

‘ఏపీ రాజకీయాలను పవన్ కచ్చితంగా ప్రభావితం చేస్తారు. ఏ పార్టీ గెలిచినా, ఓడినా అతని వల్లే. కానీ అతని గెలుపుకు మాత్రం కాదు. వేరే వాళ్లను సీఎం చేయడానికి రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదు. సినిమాలు చేసుకుంటే 70 కోట్లు వస్తాయి. పవన్ నేనే సీఎం అని చెప్తే టీడీపీ, బీజేపీలు మద్ధతుగా నిలుస్తాయా? అన్నది చూడాలి. జగన్‌ని చించుతారా? తుంచుతారా? అన్నది వదిలిపెడితే వైసీపీ కాకుండా ఈ మూడు పార్టీలు కలిస్తే సంచలనం అవుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే స్టేజీ ఎక్కితే ప్రపం వింత అవుతుంది. కానీ, పవన్ చేతి కింద పని చేస్తానని చంద్రబాబు, లోకేష్ చెప్తారా? అలా ఒప్పుకుంటే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే పవన్, చంద్రబాబులకు పడదు. చంద్రబాబు పుష్యమి, పవన్ ఉత్తర ఆషాఢ నక్షత్రాలు విరుద్ధంగా ఉంటాయి. వీరు దూరంగా ఉంటేనే బాగుంటారు. వీరిద్దరు కలిస్తే అధికారం కాదు అంధకారం అవుతుంది. వీళ్లు కలిసినా నక్షత్రాలు కలవవు కాబట్టి ప్రత్యర్ధి పార్టీలకు అనుకూలంగా మారుతుంది’ అంటూ జోస్యం చెప్పారు.