మన దగ్గర బస్సు కండక్టర్లు టికెట్లు ఎట్లా ఇస్తారో తెల్సు కదా…కాక పోతే హర్యాణా రాష్ట్రంలో ఓ కండక్టర్ మాత్రం ప్రయాణికులు కూర్చున్న సీట్ల పై నుండి జంప్ చేస్తూ అంటే ప్రయాణికుల నెత్తుల మీద నుండి వెళ్తూ టికెట్లు ఇస్తాడు. దీని గురించి ఎలాంటి ఫిర్యాదూ లేదు. ప్రయాణికులు కూడా ఇది సర్వ సాధారణ విషయంగా చూస్తారు. టికెట్లు తీసుకోకుండా ప్రయాణికులు దిగుతున్నారట. అందు కోసమే ఈ కండక్టర్ ఇట్లా టికెట్లు ఇస్తున్నాడట. కండక్టర్ వ్యవహారం చూసిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది.