గణేశుడి అమ్మగా కలెక్టర్... - MicTv.in - Telugu News
mictv telugu

గణేశుడి అమ్మగా కలెక్టర్…

August 25, 2017

చూశిన్రా అమ్మ ఒడిలో సేద తీరుతున్న బాల వినాయకుణ్ని.ఇంతకీ ఆ అమ్మ ఎవరో గుర్తు పట్టారా ? ఇంకెవరూ వరంగల్ జిల్లా కలెక్టర్  ఆమ్రపాలి. అమ్మను ఈజీగా గుర్తు పట్టడానికి వెనకాల  ఆమ్రపాలి మేడం ఫోటోను కూడా పెట్టారు. గీ వినాయకుడు విత్ ఆమ్రపాలి అమ్మ అనే విగ్రహాన్ని వరంగల్ జిల్లా కాజీపేటల పెట్టిన్రు. కలెక్టర్ మీదున్న అభిమానంతో కొందరు ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని తయారు చేయించారట.

ఇగ ఈ ప్రతిమ ఇపుడు ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై విమర్శలూ వస్తున్నయ్..  ఎంత అభిమానం ఉంటే మాత్రం దేవుణ్ణి తీసుకెళ్లి ఆమె ఒడిలో పెట్టడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం కలెక్టరమ్మ ఒడిలో బాల వినాయకుడు అదుర్స్ అని పొగిడేస్తున్నారు.

ఇవేకాదు యేడాది, యేడాదికి  వినాయక భక్తుల్లో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతున్నాయ్. తమకు ఇష్టమైన రూపంలో గణేశ్ విగ్రహాలను తయారు చేసుకుంటూ వినాయక చవితిని జరుపుకుంటున్నారు.

అవతార్ వినాయకుడు, స్పైడర్ మ్యాన్ వినాయకుడు , తాజాగా బాహుబలి వినాయకుడు, ఈగ వినాయకుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి నచ్చిన రూపంలో వినాయకుణ్ని  కొలుస్తున్నారు. ఇంతకీ వీళ్ల భక్తి  దేవుని మీద లేకపోతే ఆ వెరైటీ ప్రతిమల మీదా? అని చాలామంది విమర్శిస్తున్నారు కూడా.