డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు సన్నీలియోన్ అంటే తెగ ఇష్టం ఉన్నట్టుంది. ఆర్నెళ్లకోమారైనా ఆమెని వార్తల్లోకి తెస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా ఆమెపై షార్ట్ ఫిల్మ్ తీశాడు.అందులో ఏముందంటే…
ట్విట్టర్ నుంచి తప్పుకున్నానని ప్రకటించిన వర్మ ఇన్ స్ట్రాగ్రామ్ లో విచిత్ర పోస్ట్ లతో పిచ్చేస్తున్నాడు. గన్స్ అండ్ థైస్ వెబ్ సిరీస్ కి సంబంధించి రీసెంట్ గా ఓ ట్రైలర్ విడుదల చేసాడు ఇక ఇప్పుడు ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై అంటూ ఓ షార్ట్ ఫిలింని యూ ట్యూబ్ లో రిలీజ్ చేశాడు. సన్నీలియోన్ లా మారతానని ఓ అమ్మాయి తన తల్లితండ్రులతో ఫైట్ చేయడం, వద్దని పేరెంట్స్ వారించడం ఇవ్వన్నీ షార్ట్ ఫిలింలో చూపించాడు. శృంగారం, నగ్నత్వం లాంటివి అందులో చూపకపోయిన ఒక అమ్మాయి విలాసవంతంగా బతికేందుకు తన శరీరాన్ని అమ్ముకుంటానని ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయడం అనే అంశాన్ని టచ్ చేశాడు. ఇంకా చెప్పడమెందుకు ఆ వీడియోను మీరూ చూసేయండి.