'కేజీఎఫ్ -2'పై వర్మ ట్విట్.. ఏం ఆలోచిస్తున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

‘కేజీఎఫ్ -2’పై వర్మ ట్విట్.. ఏం ఆలోచిస్తున్నారు

April 14, 2022

kkkggghg

కన్నడ హీరో యశ్‌ తాజాగా నటించిన ‘కేజీఎఫ్‌–2’సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు సినిమా హాల్స్‌లో మార్నింగ్‌ షో కూడా వేశారు. అయితే, సినిమాను వీక్షించిన ప్రేక్షకులందరు సినిమా సూపర్‌ హిట్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తూ తెగ వైరల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో హీరో ఎలివేషన్‌ సీన్స్‌, మథర్‌ సెంటిమెంట్‌, అదిరిపోయే డైలాగులు, యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. ఈ తరుణంలో ‘కేజీయఫ్‌–2’ ఓపెనింగ్స్‌ గురించి, బాలీవుడ్‌ను ఉద్దేశించి వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

బాలీవుడ్‌లో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాను సామాజిక మాధ్యమాలలో రాం గోపాల్ వర్మ షేర్ చేస్తూ.. ‘‘బాలీవుడ్‌ మార్కెట్‌లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాల్లో కన్నడ చిత్రం ‘కేజీయఫ్‌–2’, తెలుగు చిత్రం ‘బాహుబలి–2’ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీనిపై బాలీవుడ్‌ ఏం ఆలోచిస్తుందని మీరు భావిస్తున్నారు’’ అని వర్మ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వర్మ కౌంటర్‌ వైరల్‌‌గా మారింది. మరోవైపు ‘కేజీఎఫ్‌–2’ సాధించిన సక్సెస్‌ సందర్భంగా చాలా మంది విశ్లేషకులు ‘ప్యాన్‌ ఇండియా క్లబ్‌లోకి యశ్‌కి స్వాగతం’ అంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.