very expensive players in ipl 2023 auction
mictv telugu

ఐపీఎల్ 2023 వేలంలో వీరే కోటీశ్వరులు..

November 16, 2022

very expensive players in ipl 2023 auction

ఐపీఎల్ 2023కి ఇప్పటి నుంచే సందడి మొదలైంది. తమ జట్లపై ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి. అవసరమైన ఆటగాళ్లను అంటిపెట్టుకోని ఉంచుకోగా..అవసరం లేరనుకున్న వాళ్లని రిలీజ్ చేశాయి. ఐపీఎల్ 2022లో సరిగా ఆడని స్టార్ ఆటగాళ్లను కూడా తప్పించేందుకు ఆయా ఫ్రాంచైజీలు వెనకాడలేదు. ఇక డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనున్న మినీ వేలానికి యాజమాన్యాలుసిద్ధమవుతున్నాయి. ధనాధన్ ఆటగాళ్ల కోసం కోట్లు కురిపించేందుకు రెఢీగా ఉన్నాయి. ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న హిట్టర్స్, ఆల్ రౌండర్స్ పై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే పలువురి ఆటగాళ్లపై కాసుల వర్షం కురియనుంది. ప్రధానంగా T20 వరల్డ్ కప్‎లో రాణించిన సామ్‌ కరన్‌, బెన్‌ స్టోక్స్‌, సికిందర్‌ రజాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీరితో పాటు పలువురి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి.

ఇంగ్లాండ్ వరల్డ్ కప్‌ గెవడంలో కీలక పాత్ర పోషించిన బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కరన్‌లను దక్కించుకునేందుకు ఎంత డబ్బునైనా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. స్టోక్స్‌ కనీసం 12 కోట్లు, సామ్ కరన్‌ 10 కోట్లు పలికే అవకాశం ఉందట.

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కెమరూన్‌ గ్రీన్‌, వరల్డ్ కప్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన జింబాబ్వే ఆటగాడు సికిందర్‌ రజాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అలానే ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్, మంచి ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రోసో, ఇంగ్లండ్‌ ఓపెనర్ అలెక్స్ హేల్స్ పై కాసుల వర్షం కురవనుంది. వీరికి 5 నుంచి 7 కోట్లు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక లిటన్‌ దాస్‌, జేసన్‌ రాయ్‌, హ్యారీ బ్రూక్‌, ఎవిన్‌ లూయిస్‌, జేసన్‌ హోల్డర్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిలిప్‌ సాల్ట్‌, కేశవ్‌ మహారాజ్‌లపై 2 కోట్లు వెచ్చించే అవకావాలు ఉన్నాయి.