very heigh tention in dubbaka
mictv telugu

దుబ్బాకలో హైటెన్షన్..భారీగా పోలీసుల మోహరింపు

December 30, 2022

very heigh tention in dubbaka

దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్యే రఘునందన్ మధ్య సవాళ్లతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇరువురి నాయకుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. దుబ్బాక ఆర్టీసీ బస్టాండ్ విషయంలో ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగాయి. తన వల్లే దుబ్బాకకు బస్టాండ్ వచ్చిందని రఘునందన్ రావు అంటుంటే.. బీఆర్ఎస్ ఇచ్చిన హామీ ప్రకారమే బస్టాండ్ నిర్మాణం పూర్తైందని కొత్త ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇద్దరు సవాళ్లకు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధిపై చర్చకు ఈ నెల 30న రావాలంటూ రెండు రోజుల కిందట కొత్త ప్రభాకర్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్‌ విసిరారు.

ఇక ఈ హైటెన్షన్ వాతవరం కొనసాగుతుండగా కాసేపట్లో అధికారక కార్యక్రమాలకు నలుగురు మంత్రులు హాజరుకానున్నారు. రూ.17.50కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు మంత్రులు హరీష్, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా బస్టాప్‎ను కూడా ప్రారంభించనున్నారు. ఒక పక్క రఘునందన్‌రావు సవాల్‌, మరోపక్క బీఆర్ఎస్ మంత్రుల పర్యటతో నియోజకవర్గంలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. దుబ్బాక్ బస్టాప్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇరు పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు సిద్ధిపేట సీపీ శ్వేతా సమీక్షిస్తున్నారు.