నటుడిగా ఎంతో గర్వంగా ఉంది: ప్రకాశ్ రాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

నటుడిగా ఎంతో గర్వంగా ఉంది: ప్రకాశ్ రాజ్

June 1, 2022

తెలుగు సినిమా ఇండస్ట్రీతోపాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ పలు కీలక విషయాలను బయటపెట్టారు. ఇప్పటి వరకు ఆయన..ప్రతినాయకుడిగా, హీరోగా , హీరోయిన్ తండ్రిగా, ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ నటించిన ‘మేజర్’ సినిమాకు సంబంధించి ఆయన మంగళవారం మీడియాతో తన పర్సనల్ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ”మేజర్’ సినిమా హృదయాన్ని హత్తుకునే సినిమా. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ‘మేజర్’ మూవీలో నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను కూడా ఒక భాగమైనందుకు నటుడిగా ఎంతో సంతోషం, ఎంతో గర్వంగా ఉంది. ఒక నటుడిగా నేను ఈ సినిమాలో వేసిన వేషం మిగతా సినిమాలతో పొలిస్తే, చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల అవుతుంది” అని ఆయన అన్నారు.

మరోపక్క టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో 6/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏప్లస్‌ఎస్ మూవీతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మించింది. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ ‘మేజర్’ సినిమాతో తనకు ఎదురైన పర్సనల్ ఫీలింగ్‌ను పంచుకున్నారు.