Home > Featured > రుషి కపూర్ చివరి వీడియో..ఉల్లాసంగా

రుషి కపూర్ చివరి వీడియో..ఉల్లాసంగా

veteran actor Rishi Kapoor's last moments revealed by doctors.

నటుడు రిషీ కపూర్ ఆకస్మిక మృతితో బాలీవుడ్‌ శోకసంద్రంలో మునిగిపోయింది. కరోనా కారణంగా ఆయన అంతిమ యాత్రలో కేవలం 20 మంది కుటుంసభ్యులు, ఆప్తమిత్రులు మాత్రమే పాల్గొన్నారు. ఈ విషాద సమయంలో ఆసుపత్రిలో ఆయన చివరి వీడియోను హాస్పిటల్ వర్గాలు విడుదల చేశాయి.

రిషి ముంబైలోని సర్ హెచ్‌హెన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి చేరారు. ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు ఆయన నటించిన ఓ సినిమాలోని "తేరే దర్ద్ సే దిల్ ఆబాద్ రహా" పాటను పాడి వినిపించారు. ఆ పాటను వింటూ రిషి కపూర్ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. పాట పూర్తయిన తరువాత ఆ యువకుడిని ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదని ఈ ఏడాది జనవరిలో ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు తీసిందని కొందరు అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated : 30 April 2020 6:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top