నటుడు బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో వహించిన ‘నర్తనశాల’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 24న దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల అవుతోంది. ఈ సినిమా కేవలం 17 నిమిషాల నిడివితో మాత్రమే ఉండనుంది. ఈ సినిమాలో బాలయ్యా అర్జునిడిగా కనిపించగా.. దివంగత నటి సౌందర్య ద్రౌపది పాత్ర పోషించింది. భీముడిగా దివంగత నటుడు శ్రీహరి, ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు.
తాజాగా శ్రీహరి లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లుక్‌పై శ్రీహరి తనయుడు మేఘాంశ్ స్పందించాడు. ‘అందరికీ ధన్యవాదములు.. చాలా రోజుల తర్వాత నాన్నగారిని మళ్లీ స్క్రీన్‌పై చూడబోతున్నాం. నాన్నగారి అభిమానులతో పాటు మా కుటుంబం కూడా చాలా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నది.’ అని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఈ సినిమా షూటింగ్ 2004 మార్చి 1న ప్రారంభమైంది. షూటింగ్ మధ్యలో ఉండగా సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది.
Realstar #Srihari's son @MeghamshSrihari about his father's role in #Narthanasala
First look poster of #Srihari as Bheema will be released at 10:30AM, Stay tuned to @ShreyasET #NBKOnShreyasET #Narthanasala #DasaraWithShreyasET #NBKFilms #ShreyasET pic.twitter.com/Fsy7Qwrffp
— BARaju (@baraju_SuperHit) October 21, 2020