హీరోగా శ్రీహ‌రి త‌న‌యుడి తెరంగేట్రం - MicTv.in - Telugu News
mictv telugu

హీరోగా శ్రీహ‌రి త‌న‌యుడి తెరంగేట్రం

May 21, 2019

Veteran actor srihari son meghansh to entry as a lead actor.

తెలుగు చిత్రసీమకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు. రియల్ హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీహ‌రి పెద్ద కొడుకు మేఘాంశ్ హీరోగా వెండితెర‌కి ప‌రిచ‌యం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కెరీర్ మంచి ఊపులో ఉన్న స‌మ‌యంలో 2013లో శ్రీహరి మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. శ్రీహ‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉంది.

మేఘాంశ్ బాలనటుడిగా తన తండ్రి నటించిన భైర‌వ సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మ‌య్యాడు. తండ్రి మరణం, విద్యాభ్యాసం కారణంగా కొంత కాలం సినిమాల‌కి దూరంగా ఉన్న మేఘాంశ్ త్వ‌రలో రాజ్‌దూత్ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు.  మేఘాంశ్ కొంతకాలం న‌ట‌న‌లో శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. త్వరలో కార్తీక్-అర్జున్ దర్శత్వంలో ‘రాజ్‌దూత్’ అనే చిత్రం ద్వారా పేక్షకుల ముందుకు రానున్నాడు. రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంది.