బాలుకు గిన్నిస్ రికార్డ్స్  ఇలా వచ్చాయి… - MicTv.in - Telugu News
mictv telugu

బాలుకు గిన్నిస్ రికార్డ్స్  ఇలా వచ్చాయి…

September 25, 2020

Veteran singer sp balasubramanyam guinness record

గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన సినిమా ఇండస్ట్రీలో గాయకుడిగా గాత్రాన్ని అందించారు. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర నటులకు పాటలు పాడారు. ఆయన మృతిని సంగీత ప్రియులు, యావత్ తెలుగు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. 

తన సుదీర్ఘ కెరీర్‌లో బాలు 16 భాషల్లో 41,230 పాటలు పాడి ఎన్నో రికార్డులు సృష్టించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోనూ ఆయన చోటు దక్కించుకున్నారు. ఎక్కువ పాటలు పాడిన ఘనత తోపాటు, ఒకే రోజు ఎక్కువ సమయం పాటలు పాడిన రికార్డును సొంతం చేసుకున్నారు. కన్నడ సినీ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ సంగీతంలో 12 గంటల్లో 21 పాటలు పాడి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన రోజుకు 16-17 పాటలు పాడిన రోజులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.