షాద్‌నగర్‌లో దారుణం.. యువతి సజీవ దహనం - MicTv.in - Telugu News
mictv telugu

షాద్‌నగర్‌లో దారుణం.. యువతి సజీవ దహనం

November 28, 2019

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. వెటర్నరీ డాక్టర్  ప్రియాంకా రెడ్డి అనే యువతిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వైద్యం కోసం హాస్పిటల్‌కు వెళ్లిన ప్రియాంక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్కూటీ పంక్చర్ కావడంతో నెట్టుకుంటూ వస్తుండగా రోడ్డుపై ఉన్న లారీ డ్రైవర్లే తమ కూతురును చంపి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Priyanka Reddy.

ప్రియాంక రెడ్డి తన ముఖం మీద మొటిమలు తగ్గించుకోవడం కోసం కొన్ని రోజులుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మాదాపూర్‌లోని ఓ హాస్పిటల్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో తన బైక్ పంక్చర్ కావడంతో ఇంటికి ఫోన్ చేసింది. రోడ్డుపై చీకటిగా ఉందని లారీ డ్రైవర్లను చూస్తే భయం వేస్తోందని తన చెల్లితో చెప్పింది. ధైర్యంగా రమ్మని చెప్పడంతో ఫోన్ కట్ చేసింది. మళ్లీ తిరిగి ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. వారు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షాద్‌నగర్‌లో దారుణం.. యువతి సజీవ దహనం

Posted by Satyavathi Satya on Thursday, 28 November 2019

తొండుపల్లి టోల్‌గేట్ దగ్గర ఓ యువతి మృతదేహం కాలిపోయి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ప్రియాంకా రెడ్డి శవమేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె స్కూటీకి పంక్చర్ వేయిస్తానని ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షి శంషీర్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆ వ్యక్తి ఎవరూ.. ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాగా నవాబుపేట మండలం కొల్లూరులో వెటర్నరీ డాక్టర్‌గా ప్రియాంక  విధులు నిర్వహిస్తోంది.