ఉద్యోగాలు సరే.. నిరుద్యోగ భృతి ఎక్కడ? - వీహెచ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగాలు సరే.. నిరుద్యోగ భృతి ఎక్కడ? – వీహెచ్

March 9, 2022

 19

అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు స్పందించారు. ఉద్యోగాల భర్తీని స్వాగతిస్తున్నామంటూ నిరుద్యోగ భృతి ఎక్కడ అంటూ సూటిగా ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన, నిరుద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటించారని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల వయోపరిమితి పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిదని, దాని ఫలితమే నేటి ముఖ్యమంత్రి ప్రకటన అని తెలిపారు. ఉద్యోగాలు రాక, చనిపోయిన యువకుల కుటుంబాలకు క్షమాపణ చెప్పి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని కోరారు. మరోవైపు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ ప్రకటన బోగస్ అంటూ విమర్శించారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఆ తర్వాత తన అనుయాయులతో కోర్టులో కేసులు వేసి భర్తీ ప్రక్రియను కేసీఆర్ అడ్డుకుంటారని చెప్పారు. ఆ తర్వాత ఆ నెపాన్ని ప్రతిపక్షం మీద నెట్టేసి ఓట్లు దండుకోవడానికి పథకం ప్రకారం వ్యూహాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.