వర్మ.. నీకు సిగ్గుందా!: వీహెచ్ - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ.. నీకు సిగ్గుందా!: వీహెచ్

August 24, 2017

https://www.youtube.com/watch?v=iPXOXPoRB3s

‘అర్జున్ రెడ్డి’ సినిమా కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సినిమా పోస్టర్ ను చించేసిన వీహెచ్ హనుమంతరావును రాం గోపాల్ వర్మ చెండడగా, వీహెచ్ కూడా అంతెత్తున్న మళ్లీ ఫైర్ అయ్యారు.

‘రాంగోపాల వర్మకు  ఏం పనీ పాటాలేదు, అసలు వాడు ఏం మాట్లడతడు… వాడసలు డైరెక్టరేనా ? నీకు సిన్మ నడ్సేదే ముఖ్య మారాబై? ఇసొంటి  సిన్మలు దియ్యాలే..  పైసలు సంపాయించాలే …దేశం ఏమన్న గానీ ఎటన్న వోనీ.  రౌడీల సిన్మలు దీస్తడు ,గుండాల సిన్మలు దీస్తడు…రాంగోపాల్ వర్మ.   ఏం సలహారా బై నీకడ్పు సల్లగుండ. నేను వొయ్యి నా మన్మల్ల నడుగాల్నా  బిడ్డా ఇట్ల ముద్దు పెట్టుకోవాలని…బిడ్డా.. ఈసిన్మ జూడు ఎట్ల ముద్దు వెట్కొన్రని, అట్లడగనీకి  నాకన్న సిగ్గుండాలే …సెప్పినందుకు నీకన్నా సిగ్గుండాలే..’ అని వీహెచ్ దంచికొట్టిండు.

‘పిల్లల్ని చెడగొట్టేతందుకు ఇటువంటి సిన్మలు తీస్తున్రా?ఫ్యూచర్ జనరేషన్ వాళ్లు బాగుపడద్దా? అరే ఇట్ల ముద్దు వెట్టుకునే  గిసొంటి సిన్మలు వస్తే మొగోళ్లు ఎవరైనా అన్కుంటరు. సిన్మలల్లనే సూపిస్తున్నరు, మేం జేస్తె తప్పేమున్నది అని.  ఇయ్యాల్ల ముద్దు సీన్లు వచ్చినయ్. ఇట్లనే ఊకుంటిమంటే రేపు రేపు  ఇంకేమైనా వస్తయ్. సెన్సార్ బోర్డు వాళ్లు ఇట్లాంటి వాటిమీద చర్య ఎందుకు తీస్కుంటలేరో వాళ్లనుగుడ  గట్టిగ అడ్గుతా…అన్ని మహిళ సంఘాలను కూడా రమ్మన్న…ఇసొంటియ్ మళ్లీ రాకుంట గట్టి చర్యలు తీస్కోవాలే’ అని  హనుమంతరావ్ అన్నడు.

‘అర్జున్ రెడ్డి’ లిప్ లాక్ పోస్టర్ ను వీహెచ్ చించేయడం, దీనిపై వర్మ ఘాటుగా స్పందించడం తెలిసిందే. ‘‘ వీహెచ్ కు అలాంటటి అందమైన యువతి ఎప్పుడూ ముద్దివ్వలేదా. వీహెచ్.. ఆ పోస పోస్టర్‌ను తన మనవళ్లు, మనవరాళ్లకు చూపించి అందులో ఏదైనా తప్పుందా? అని అడగాలి’ సూచించారు.  తాను చేసిన పోస్టులు తాతయ్యకు అర్థం కాదేమోనని కామెంట్‌ చేశారు. ‘తాతయ్యా..! అర్జున్‌ రెడ్డి సినిమా మీ తాతయ్యల కోసం కాదు. మీ మనవళ్లు మనవరాళ్ల కోసం అని అర్థం చేసుకోండి.’ అని వర్మ పోస్టులో పేర్కొన్నారు. ‘మీ పార్టీ ఎలానో తాతయ్య అయిపోయింది. మీ పిల్ల చేష్టల వల్ల భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి రాష్ట్రంలోని మీ మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ ఓటు వేయరని అన్నారు. అప్పుడు మీ వల్ల మీ కాంగ్రెస్‌ పార్టీ పే..ద్ద.. తాతయ్య అయిపోతుంది’ అంటూ మరో కామెంట్‌ చేశారు.