మోదీ.. నిజం తెలుసుకో! అంజయ్య ఎస్సీ కాదు రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ.. నిజం తెలుసుకో! అంజయ్య ఎస్సీ కాదు రెడ్డి

February 8, 2018

కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను ఘోరంగా అవమానించిందంటూ మోదీ బుధవారం పార్లమెంట్ ప్రసంగంలో అప్పటి సీఎం టంగుటూరి అంజయ్య ప్రసక్తి తీసుకురాడం తెలిసిందే. బేగంపేట విమానాశ్రయంలో దళితుడైన అంజయ్యను రాజీవ్ గాంధీ కించపరచారని మోదీ అన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ప్రధాని నిజాలు తెలుసుకోకుండా ఏవేవో మాట్లాడుతున్నారని, అంజయ్య ఎస్సీ కాదని రెడ్డి అని చెప్పారు.

‘ప్రధాని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. అంజయ్య రెడ్డి, ఆయన భార్య, కొడుకు కూడా రెడ్డే. రాజీవ్ గాంధీ అంజయ్యనుగాను, మరెవర్నీగాని అవమానించలేదు..’ అని వీహెచ్ చెప్పారు. టి. అంజయ్యకు రామకృష్ణారెడ్డి అనే మరో పేరు కూడా ఉంది. అసలు పేరు అంజయ్యేనని అయితే, తనను రామకృష్ణారెడ్డి అనికూడా పిలుస్తుంటారని అంజయ్య చెప్పేవారు. ఆయన తండ్రిపేరు పాపిరెడ్డి. మెదక్ జిల్లా భానూర్‌కు చెందిన వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.