VHP calls to boycott Valentine's Day and tribute to immortalsoldiers
mictv telugu

గులాబీలు కాదు…నివాళులర్పిద్దాం: వీహెచ్‎పీ

February 7, 2023

VHP calls to boycott Valentine's Day and tribute to immortalsoldiers

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను బహిష్కించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ పిలుపునిచ్చాయి. ఈ మేరకు వాల్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించాయి. వాలంటైన్స్ డే విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. ఫిబ్రవరి 14న పుల్వమా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరించుకుందాం. అమరజవాన్ల గుర్తుగా ఫిబ్రవరి 14ను జరుపుకుందామని వీహెచ్ పీ నిర్ణయించింది. ప్రజలంతా అమరజవాన్లకు నివాళులర్పించాలని పిలుపునిచ్చింది. దేశం కోసం పని చేస్తున్న వీరజవాన్లను స్మరించుకుందామంటూ వీహెచ్ పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ తెలిపారు.

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రేమికుల దినోత్సవాన్ని నిషేధిస్తున్నామన్నారు భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరామ్. బ్యాన్ వాలంటైన్స్ డే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పబ్బులు, హొటళ్లు, పార్కులలో ఎవరైనా ప్రేమికుల రోజు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రీటింగ్ కార్డుల దహనం ఉంటుందని తెలిపారు. ఆ రోజు అమరజవాన్లను స్మరించుకుని దేశభక్తిని చాటుకుందామంటూ పిలుపునిచ్చారు.