నక్సలైట్ కథాంశం నేపథ్యంలో సాయిపల్లవి నటించిన సినిమా విరాటపర్వంపై విశ్వహిందూ పరిషత్‌కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాకు అనుమతులిచ్చిన సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ అజయ్ రాజ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
నక్సలిజం, ఉగ్రవాదం వంటి వాటిని ప్రోత్సహించేలా ఉన్న సినిమాకు అనుమతివ్వడం అభ్యంతరకరమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు మతాలపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలకు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మద్ధతు పలికాడు. అన్నింటికన్నా మానవత్వమే ముందని, సాయిపల్లవికి తామంతా తోడుగా ఉంటామని ప్రకటించారు.