కుర్చీ పెద్దది.. బుద్ధి చిన్నది.. వీసీ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కుర్చీ పెద్దది.. బుద్ధి చిన్నది.. వీసీ అరెస్ట్

February 3, 2018

లంచావతారాలు ఇందుగలవు.. అందులేవని సందేహము వలదు. పదవులను అడ్డం పెట్టుకుని సంపాదించడంలో అధికారులు కూడా రాజకీయనాయకులకు ఏమాత్రం తీసిపోవడం లేడు. లక్షల జీతాలు, కార్లు.. మరెన్నో సదుపాయాలు ఉన్నా ఉద్దర డబ్బుల కోసం టేబుళ్ల చేతులు దూరుస్తూ కక్కుర్తి పడుతూనే ఉన్నారు. రూ. 30 లక్షల లంచానికి ఆశపడిన కోయంబత్తూరులోని భారతీయార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ. గణపతి అడ్డంగా దొరికిపోయాడు.సురేశ్ అనే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టును రెగ్యులరైజ్ చేయడానికి గణపతి లంచం అడిగాడు. ఈ విషయాన్ని సురేశ్ ఏసీబీకి చేరవేశాడు. పక్కా పథకం ప్రకారం అధికారులు సురేశ్‌తో డబ్బును గణపతికి అదించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వర్సిటీలో ఇదివరకు వీసీలుగా పనిచేసిన పలువురు కూడా లంచాలు తిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీసీ స్థాయిలో ఉన అధికారులు ఇలా అక్రమాలకు పాల్పడడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.