ఉపరాష్ట్రపతిగా తెలంగాణ బిడ్డ..? - MicTv.in - Telugu News
mictv telugu

ఉపరాష్ట్రపతిగా తెలంగాణ బిడ్డ..?

June 26, 2017

రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ కన్ ఫామ్. లాస్ట్ మినిట్ లో లెక్కలు కిందమీద అయితే తప్ప మీరాకుమార్ గెలువరు. ఇక ఇప్పుడు చర్చ అంతా ఉపరాష్ట్రపతి గురించే. అందులో తెలుగోళ్లు రేసులో ఉన్నారంటే ఇంకా ఇంట్రెస్టింగ్. ఎన్డీఏ అభ్యర్థిగా విద్యాసాగర్‌రావు పేరు పరిశీలన లో ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజం..?

మహారాష్ట్ర గవర్నర్‌, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు మళ్లీ న్యూస్ మేకర్ గా మారారు. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. సోషల్‌ మీడి యాలో ఇది వైరల్‌ అవుతోంది. ఉపరాష్ట్రపతిగా విద్యాసాగర్‌రావు? అంటూ సోషల్‌ మీడియా లో వచ్చిన వార్త కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలుగురాష్ట్రాల్లో చర్చకు తెరలేపింది.

ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 11న ముగుస్తుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్డీఏ ఎంపిక చేసింది. ఉత్తరాది వ్యక్తిని రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాది వ్యక్తికి కట్టబెడతారని అంతా అనుకుంటున్నారు.మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌ రావు పేరును హైకమాండ్ ఉపరాష్ట్ర పతి పదవి కి పరిశీలిస్తుందని టాక్. అన్ని అను కూ లిస్తే ఆయన పేరు ఖరారయ్యే అవకాశం లేక పోలేదంటున్నారు ఆ పార్టీ నేతలు.

నార్త్ ఇండియా , సౌతిండియా లెక్కలు చూస్తే కచ్చితంగా ఇక్కడి వ్యక్తికే ఆ పదవి ఇవ్వాల్సిందే. ఎలాగూ మోదీకి నార్త్ ఇండియా తప్ప సౌతిండియా కనిపించడం లేదని ఎప్పుడు మైక్ పడితే అప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శిస్తుంటారు. దీన్ని చెరిపేసుకునేందుకు ఇదే అవకాశమని మోదీ సేన ప్రయత్నించవచ్చు. ఇందుకోసం చక్రం తిప్పే వెంకయ్యనాయుడు ఉండనే ఉన్నారు. విద్యాసాగర్ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉన్నది. ఇది కూడా ప్లస్ పాయింట్. ఏ లెక్కన చూసిన విద్యాసాగర్ కే అవకాశలు ఎక్కువ ఉన్నాయి.

కొందరు పనిలోపనిగా తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ పేరును వినిపిస్తున్నారు. ఆయన్ను ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడనుంచి జరుపకపోవచ్చు. ఎందుకుంటే ఇద్దరు చంద్రుల్ని బ్యాలెన్స్ చేస్తూ చక్కగా నడిపిస్తున్నారు కాబట్టి.అయినా నరసింహన్ కాంగ్రాస్ అపాయింట్ చేసిన గవర్నర్. ఎంత ట్రాక్ రికార్డ్ ఉన్నా ఏ మూలానో కమలనేతలకు గుచ్చుతూనే ఉంటుంది. అందకే ఆయనకు చాన్సెస్ చాలా చాలా తక్కువ.
సో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కు బోలెడ్ ప్లస్ పాయింట్స్..బీజేపీ అధిష్ఠానం అండదండలు ఉన్నాయి. సౌతిండియా వైపు మోదీ, అమిత్ షా ద్వయం చూస్తే ఆయనకే పక్కా ఉపరాష్ట్రపతి పదవి..