ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్

September 29, 2020

Vice President Venkaiah Naidu tests COVID-19 positive, opts for home quarantine

కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టనంటోంది. దేశవ్యాప్తంగా వరుసగా పలువురు నేతలకు కరోనా సోకింది. మొన్నటికి మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో మంత్రి గజేంద్ర సింగ్ షెకావంత్కు కరోనా పాజిటివ్ రాగా, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే. మరికొందరు నేతల్లో కొంతమంది కోలుకోగా.. కొందరు కరోనాకు బలయ్యారు. కొద్దిరోజుల క్రితం కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి కరోనా బారిన పడి కన్నుమూశారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది.  ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులకు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఆయన సతీమణి ఉషా నాయుడికి నెగెటివ్‌గా తేలగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది. 

ఆయనకు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, ఈ నెలలో జరిగిన రాజ్యసభ సమావేశాలను నిర్వహించిన వెంకయ్యనాయుడు.. ఎంపీలంతా కరోనా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. సమావేశాల సమయంలోనే 40 ఎంపీలతో పాటు పలువురు సిబ్బందికి కరోనా రావడంతో సమావేశాలను కుదించారు. పలు కీలక బిల్లులకు ఆమోదం పొందిన వెంటనే ఉభయ సభలను ముగించారు.