ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే తరుపున వెంకయ్యనాయుడు పోటీచేస్తుండగా, ప్రతిపక్షాల తరుపున గోపాలకృష్ణ గాంధీ పోటీచేస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీ పార్లమెంట్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థీ గా పోటీ చేస్తున్న వెంకయ్యనాయుడు కి ఓటేశారు. ఎంపీలంతా భారీ సంఖ్యలో ఓటీంగ్ కు హాజరుయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పారికర్ లతో పాటు బీజేపి నేతలు అనురాగ్ ఠాకూర్, సుబ్రమణ్యం స్వామి కూడా ఓటు వేసేందుకు పార్లమెంట్ కు వచ్చారు.
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి పదవి కాలం ఈ నెల 10 తేదితో ముగుస్తుంది. అధికార ఎన్డీయే అభ్యర్థీగా వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ వామపక్షాల అభ్యర్థీగా మహాత్మాగాంధీ మనువడు గోపాలకృష్ణ గాంధీ ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీపడుతున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల తో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అయితే మెుత్తం ఎలక్టోరల్ కాలేజీ లోని సభ్యుల సంఖ్య నామినేటెడ్ సభ్యులతో 790. అయితే వీటిలో లోక్ సభ సీట్లు రెండు, రాజ్యసభ లో ఒక సీటు ఖాళీగా ఉన్నాయి.బీజేపి లోక్ సభ సభ్యుడు కోర్టు తీర్పు వలన చెడి పాశ్వాన్ ఎన్నికల్లో ఓటు వేసే అర్హతను కోల్పోయారు. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు సాయంత్రం ఏడు గంటలకు వెలువడే అవకాశం ఉంది.