Vice-Presidential elections nda candidate jagdeep Dhankhar wins election
mictv telugu

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ధన్‌కడ్ విజయం

August 6, 2022

jagdeep Dhankar

ఉపరాష్ట్రప‌తి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి,  ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ ఘనవిజయం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, ప్రతిపక్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వాపై ఆయ‌న 364 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోలింగ్ శనివారం సాయంత్రం 5వరకు జరిగింది. తర్వాత ఫలితాలు ప్రకటించారు. మొత్తం పోలైన ఓట్లు 725 కాగా, అందులో జ‌గ‌దీప్‌కు 528 ఓట్లు దక్కాయి.  మార్గ‌రెట్ ఆల్వాకు కేవ‌లం 182 మాత్ర‌మే పడ్డాయి. 15 చెల్ల‌లేదు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విపక్షాల అభ్యర్థికి, వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వడం తెలిసిందే.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంక‌య్య నాయుడు ఈ నెల 10న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయనున్నారు. 11న కొత్త ఉపరాష్ట్రపతిగా జ‌గ‌దీప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజస్తాన్‌కు చెందిన జగదీప్ చంద్రశేఖర్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.