కత్రీనా ఇంటికి అర్ధరాత్రి దొంగలా వెళ్లిన విక్కీ ! - MicTv.in - Telugu News
mictv telugu

కత్రీనా ఇంటికి అర్ధరాత్రి దొంగలా వెళ్లిన విక్కీ !

August 10, 2020

Vicky Kaushal Gets Clicked Arriving at Katrina Kaif's Residence.

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌, యువ నటుడు విక్కీ కౌశ‌ల్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలను విక్కీ కౌశల్ తోసిపుచ్చారు. కానీ, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వస్తున్నా వార్తలకు బలం చేకూర్చేలా వున్నాయి వీరి చేష్టలు. 

తాజాగా విక్కీ తలకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజు ధరించిన ఆదివారం రాత్రి ముంబైలోని కత్రినా ఇంట్లోకి వెళ్తున్నపుడు కొందరు ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో వీరిద్దని మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే విక్కీ ప్రస్తుతం ‘సర్దార్ ఉధం సింగ్’ సినిమాలో నటిస్తుండగా.. కత్రినా ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తుంది.