ఫ్యాన్ తుడవడానికి స్టూల్ అవసరమా అంటున్న విక్కీ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్యాన్ తుడవడానికి స్టూల్ అవసరమా అంటున్న విక్కీ

April 4, 2020

Vicky Kaushal gives interacting with fans a new meaning during lockdown, Arjun Kapoor has hilarious response

వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వలేనంత బిజీలో ఉంటారు సెలబ్రిటీలు. అలాంటి వారికి లాక్‌డౌన్ ఊరటనిచ్చింది. దీంతో వారు ఇళ్లల్లో పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చేసిన పనుల తాలూకు వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లలకు మంచి మంచి రైమ్స్ నేర్పించడం,  వ్యాయామం వంటి పనులు చేస్తూ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ఓ వీడియోను పంచుకున్నాడు. 

హాయిగా ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌ను శుభ్రం చేస్తూ తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో ‘ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా’ అని పేర్కొన్నాడు. ‘ఈ రోజు నా అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతానని అనుకున్నాను. క్వారంటైన్‌ లైఫ్‌’ అనే క్యాప్షన్‌ కూడా జతచేశాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ కొన్ని రోజులు మీరు ఇంట్లో ఉండి ఇన్ని పనులు చేస్తున్నారు.. రోజూ ఉంటే ఇంకా ఎన్ని పనులు చేస్తారో అని అంటున్నారు.