ఓడిన సన్ రైజర్స్... ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు! - MicTv.in - Telugu News
mictv telugu

ఓడిన సన్ రైజర్స్… ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు!

October 25, 2020

nnfg

ఈ సీజన్ ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. శనివారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరవ స్థానానికి పడిపోయింది. ఇంకా మూడు లీగ్ మ్యాచ్ లు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో వార్నర్ సేన ఆ మూడు మ్యాచ్ ల్లో గెలవడం తప్పనిసరి అయింది. అయినా కూడా ప్లే ఒఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో హైదరాబాద్ లీగ్ మ్యాచ్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నార.

 ఇక శనివారం జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన‌ పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ ఆటగాళ్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (27), పూరన్ (32), గేల్ (20) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రాషిద్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. 127 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టును పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 19.5 ఓవర్లకు హైదరాబాద్ జట్టు 114 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. తద్వారా వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. అలాగే ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ ఆటగాళ్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (35), విజయ్ శంకర్(26) పరుగులు చేశారు. పంజాబ్ ఆటగాళ్లలో అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ మూడేసి వికెట్లు తీశారు. షమీ, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు.