Video: 75 years of independent India in 2 minutes..
mictv telugu

వీడియో: 2 నిమిషాల్లో 75 ఏళ్ల స్వతంత్ర భారతం..

August 10, 2022

దేశవ్యాప్తంగా ఇటు సామాజిక మాధ్యమాల్లో అటు టీవీ ఛానెల్స్‌లో ప్రస్తుతం ఓ రెండు నిమిషాల వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియోను వీక్షిస్తున్న వారంతా భారతదేశం 75 ఏళ్లలో ఇంతా అభివృద్ది చెందిందా? అంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. వీడియోను ‘గూగుల్ ఇండియా’ కొన్ని ఫోటోలతో అందంగా రుపొందించింది. అందులో భారతదేశంలో మొట్టమొదటగా జరిగిన అద్భుతాలు, విజయాలు, వ్యక్తులు తదితర అంశాలను పేర్కొంది. మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియోను మనం కూడా చూసేద్దామా..

”స్వాతంత్రం సిద్ధించిన రోజు ఆగస్టు 15, 1947. ఆ అపురూప క్షణాలను ఆనందించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి జాతీయ జెండాలను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో ‘గూగుల్ ఇండియా’ ఓ అద్బుతమైన వీడియోను తయారు చేసింది. వీడియోలో 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత్ ముద్దాడిన ఘనతలను, మైలురాళ్లను కలిపి మొత్తం 2 నిమిషాల్లో చూపించింది. ‘ఇండియాకి ఉడాన్’ పేరిట యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో విశేష స్పందన లభించింది.

వీడియోలో ”స్వాతంత్ర ఉద్యమ ముగింపు ఘట్టం. స్వతంత్ర భారత్‌లో తొలి ఎన్నికల ఘట్టం. రాజ్యాంగం రూపకల్పన. మొదటి పంచవర్ష ప్రణాళిక. ఇండియాలో తొలి కంప్యూటర్ వినియోగం. హరిత విప్లవం. శ్వేతవిప్లవం. తొలి అంతరిక్ష ప్రయోగం. భారతీయ వ్యక్తికి తొలి ఆస్కార్. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం. 1991 – ఆర్థిక సంస్కరణలు. సినిమా రంగం. పోలియో నిర్మూలన. విద్యాహక్కు చట్టం. యూపీఐ చెల్లింపులు” వంటి కీలక ఘట్టాలు ఉన్నాయి.