ప్రమాదం ఎట్నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో ఈ లోకంలో ఎవరు ఊహించలేరు. మనం రోడ్డుపై ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా, ఎదుటివారు చేసే చిన్న చిన్న మిస్టేక్‌ల వల్ల ఊహించని రీతిలో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలను నివారణ చేయడానికి ఎన్ని సూచనలు చేసినా, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొంతమంది వాహనదారుల్లో మార్పు మాత్రం రావటం లేదు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ కారు డ్రైవర్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఓ వ్యక్తి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో..”ఓ మహిళ ఓ ఇంటి గేటు ముందు నిలబడింది. ఇంతలోనే ఓ కారు రోడ్డు పక్కన వచ్చి ఆగింది. ఆ తర్వాత ఆ కారు డ్రైవర్ డోరు తీస్తుండగా సడన్‌గా ఓ స్కూటీపై ఓ వ్యక్తి స్పీడ్‌గా వచ్చి డోరును ఢీకొట్టి, కిందపడ్డాడు. ఇక అంతే, రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, ఆ కారు డ్రైవర్ గాయపడిన వ్యక్తికి ఎంతసేపు చికిత్స చేసిన ఉలుకు పలుకు లేదు. దాంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స చేసినప్పటికి అతనిలో ఏలాంటి చలనం లేకపోవడంతో మృతి చెందాడని నిర్ధారించారు.”
Scooter rider dies due to negligence of car driver in #Lucknow.
The driver of the car opened the gate of the car. The scooter rider fell on the road after hitting deep
Door, biker died during treatment.
Incident in Alambagh area.
#ACCIDENT @MORTHIndia pic.twitter.com/lO87FUn6HX— @PotholeWarriors Foundation #RoadSafety🇮🇳🚙🛵🛣 (@PotholeWarriors) July 15, 2022
అయితే, వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్.. ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే తలకు బలమైన గాయమైందని, హెల్మెట్ పెట్టుకోని ఉంటే అతడు ఖచ్చితంగా బ్రతికేవాడని కామెంట్స్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అక్కడ అమర్చి ఉన్న సీసీటీవీని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించిన ఆ దృశ్యాలను విడుదల చేశారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ..” ఇప్పటికైనా యువకులు, వాహనదారులు అర్థం చేసుకోండి. హెల్మెట్‌ను తప్పనిసరిగా పెట్టుకోండి. అప్పుడే మీరు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడుతారు” అని అన్నారు.