Video: Actress Urvashi's reel with Pak cricketer..Netizens outraged
mictv telugu

వీడియో: పాక్ క్రికెటర్‌తో నటి ఊర్వశి రీల్..ఆగ్రహంలో నెటిజన్లు

September 8, 2022

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌కు హాజరైన ఊర్వశి రౌతేలాను, పాకిస్తాన్‌ యువ క్రికెటర్ నసీమ్ షా..ఊర్వశిని కన్ను అర్పకుండా అట్లే చూశాడు. దాంతో నసీమ్ షా చూపులను గమనించిన ఊర్వశి సిగ్గు పడుతూ, ముఖం చాటేసింది. అంతేకాదు, ఆ వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది.

ఆ వీడియోను వీక్షించిన నెటిజన్స్..’రిషభ్ పంత్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి, ఆ తర్వాత బ్రేకప్ చేసుకొని, విరహ వేదనతో ఉన్న ఊర్వశి రౌతేలా మళ్లీ ప్రేమలో పడిందా?, పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా బౌన్సర్లకు ఈ అమ్మడు క్లీన్ బౌల్డ్ అయిందా?’ అంటూ రిషభ్ పంత్ పేరు జోడిస్తూ, తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఊర్వశి..తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆ వీడియోను తొలగించినట్లు తెలుస్తోంది.

ఇక, రిషభ్ పంత్, ఊర్వశి విషయానికొస్తే.. తాజాగా ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. ఒకసారి ఢిల్లీలో షూటింగ్ పూర్తయ్యాక రాత్రికి హోటల్‌కు చేరుకున్నా. అప్పటికే ఆర్పీ అనే వ్యక్తి నన్ను కలవడం కోసం హోటల్ లాంజ్‌లో ఎదురుచూస్తున్నాడు. నేను అలసిపోవడంతో గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకున్నా. నిద్రలేచేసరికి 16-17 మిస్డ్ కాల్స్ ఉండటంతో బాధపడ్డా. నాకోసం ఒకరు ఎదురుచూస్తున్నా కలవలేకపోయానని బాధపడ్డా. తర్వాత కలుద్దాం అని చెప్పాను. ముంబైలో అతడిని కలిశాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.

 

దీంతో ఆ మరుసటి రోజే..పంత్ తన ఇన్‌స్టా స్టోరీలో..”కొందరు వ్యక్తులు ఇంటర్వ్యూల్లో పాపులారిటీ తెచ్చుకోవడం కోసం అలా ఎలా అబద్ధాలు ఆడతారు? ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్లు ఫేమస్ అయ్యేందుకు ఇలా ప్రవర్తించడం బాధాకరం. అలాంటి వాళ్లను దేవుడు దీవించుగాక” అని పోస్టు చేసి, కాసేపట్లోనే డిలీట్ చేశాడు. దీనిపై ఊర్వశి కౌంటర్ వేసింది. ‘చోటు భయ్యా నువ్వు క్రికెట్ ఆడుకోవాలి. నేనేం చిన్న పిల్లని కాదు. బద్నాం చేయడానికి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.