తాజాగా క్యూబా దేశంలో రెండు ఏనుగులు నీళ్ల కోసం వచ్చి, బురదలో చిక్కుకుని రెండు రోజులపాటు నానా అవస్థలు పడిన విషయం తెలిసిందే. దాంతో విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు హెలికాప్టర్లో వచ్చి వాటిని రక్షించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే, ఈసారి వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగు ఓ భవనంలోకి ప్రవేశించింది. బయటకు వెళ్లేందుకు ఆ ఏనుగు డోర్‌లోకి ప్రవేశించింది. అంతే.. బయటికి వచ్చే క్రమంలో దర్వాజాలో ఇరుక్కుపోయి చాలాసేపు అవస్థలు పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
I bet you may not have seen a better quality control inspector than this one. 🥰
VC: SM @susantananda3 @AwanishSharan @arunbothra @supriyasahuias @deespeak pic.twitter.com/Oz4OaCZFdl— SAKET (@Saket_Badola) September 12, 2022
వీడియోలో..” ఓ పెద్ద భవనం కనిపిస్తుంది. అందులో ఓ ఏనుగు ఎలాగు ప్రవేశించిందో తెలియదు. కానీ, బయటికి వచ్చే క్రమంలో ఆ భవనంలోని దర్వాజాలో ఇరుక్కుపోయింది. బయటకు వచ్చేందుకు చాలా కష్టపడింది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఎలాగోలా ఆ దర్వాజా నుంచి గట్టెక్కింది. ఈ తతంగం మొత్తం వీడియోలో రికార్డయింది.”
ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ అధికారి అయిన సాకేత్ బడోలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ అతికొద్ది నిమిషాల్లోనే తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ‘ఇంతకంటే గొప్ప క్వాలిటీ కంట్రోలర్‌ను మీరు చూసి ఉండరని నేను బెట్ వేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు.