Video: Boy, 6, Takes Father To Hospital In Pushcart In Madhya Pradesh
mictv telugu

హృదయ విదారకం… తోపుడు బండిపై తండ్రిని తోసుకెళ్లిన‌ బాలుడు

February 12, 2023

Video: Boy, 6, Takes Father To Hospital In Pushcart In Madhya Pradesh

అంబులెన్స్ దొర‌క‌క‌..ఆటోలో తీసుకువెళ్లేందుకు డ‌బ్బులు లేక చివ‌ర‌కి తండ్రిని తోపుడు బండిలో తీసుకువెళ్లాడు ఓ బాలుడు.తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆరేళ్ల కుర్రాడు పడ్డ అవస్థ చూస్తే కళ్లు చెమర్చక మానవు. సింగ్రౌలీకి చెందిన షా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువ కావడంతో షాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆయన భార్య, ఆరేళ్ల కొడుకు ప్రయత్నించారు. అంబులెన్స్ కోసం ఆసుపత్రికి ఫోన్ చేయగా.. అటువైపు నుంచి స్పందనలేదు.

నిరుపేద కుటుంబం కావడంతో అతడిని ఆటోలో తీసుకెళ్లేంత డబ్బుల్లేవు. ఏంచేయాలో తోచక చివరకు తోపుడు బండిపై షా ను ఆసుపత్రికి తీసుకెళ్లాలని తల్లీకొడుకులు నిర్ణయించారు. ఇద్దరూ కలిసి అతడ్ని తోపుడు బండిపైకి చేర్చారు. ఆపై బండిని 3 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తోసుకెళ్లారు. తల్లితో కలిసి తండ్రిని తోపుడు బండిపై పడుకోబెట్టి తోసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ ఘటన నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.