సినిమా కాదు.. బ్యాంకులోకి చొరబడి దోపిడీ.. - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా కాదు.. బ్యాంకులోకి చొరబడి దోపిడీ..

September 16, 2019

సినిమాలు, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు సమాఉజ్జీగా ఇప్పుడు సీసీటీవీ వీడియోలు కూడా జనాలకు ఎంటర్‌టైన్‌మెంటుగా మారాయి. అదే స్థాయిలో దొంగలను తేలికగా పట్టించడంలో పోలీసులకు సీసీటీవీ కెమెరాలు చాలా ఉపకారులుగా మారాయి. దొంగలు  గన్నులు, కత్తులు పట్టుకుని అకస్మాత్తుగా బ్యాంకులోకి వచ్చి బెదిరించి డబ్బు దోచుకుపోతారు. ఇలాంటి సన్నివేశాలను మనం చాలా సినిమాల్లో చూశాం. ఫిక్షన్ కథల్లో చదివాం. అయితే సినిమాల్లోని సన్నివేశాల్లో నటన వుంటుంది. కథల్లో ఊహ వుటుంది. కానీ, సీసీటీవీ సీన్స్‌లో రియాలిటీ వుంటుంది. అలాంటి ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో నిజమైన దొంగలు బ్యాంకును ఎలా దోచుకున్నారో చూడొచ్చు. 

రాజస్తాన్ ఉదయ్‌పూర్‌ బ్యాంకులో సోమవారం భారీ చోరీ జరిగింది. ఆరుగురు దొంగలు బ్యాంకులోకి ప్రవేశించి తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. అనంతరం బ్యాంకులో ఉన్న నగదును దొంగలు దోచుకెళ్లారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం రూ. 19.72 లక్షల నగదు దోచుకెళ్లినట్లు సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, ఈ బ్రాంచ్ చిన్నది కాబట్టి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదని బ్యాంకు మేనేజర్ తెలిపారు.