Video: Burqa woman molested in Pakistan
mictv telugu

వీడియో: పాకిస్తాన్‌లో బురఖా మహిళపై వికృత చేష్ట

July 19, 2022

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఓ మహిళపై ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పని రీత్యా బయటికి వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్తోన్న ఓ మహిళపై వెనక నుంచి వచ్చి ఓ వ్యక్తి ఆమెను గట్టిగా కౌగిలించుకొని, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.

 

ఆ వీడియోలో.. ”వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. వెనుక నుంచి వెళ్లి ఆమె గట్టిగా పట్టుకుని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విడిపించుకునేందుకు బాధితురాలు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వేధించిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు ఆ దుండగుడు.”

ఈ వీడియోను పాక్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ హమీద్‌ మీర్‌ ట్విటర్ ద్వారా పోస్ట్‌ చేశారు. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించి, ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలని అక్కడి మహిళలు కోరుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెను దుండగుడు ఫాలో అవుతున్నట్లు అంతకు ముందు గల్లీలో ఉన్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా సోషల్‌ మీడియా విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు.